YS Sharmila : షర్మిలతో రాయబారాలు చేయలేదు.. విజయమ్మను కలిసింది అందుకే: వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన

తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిశానన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరినా తమకు ఇబ్బంది ఉండదన్నారు.

New Update
YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి  కీలక వ్యాఖ్యలు.!

YV Subba Reddy : జగన్ తరఫున తాను వైఎస్ షర్మిలతో(YS Sharmila) ఎలాంటి రాయబారాలు చేయలేదని వైసీపీ(YCP) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల తరువాత విజయమ్మను కలిసేందుకు హైదరాబాద్(Hyderabad) వెళ్లానన్నారు. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా? అని ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: వైసీపీకి బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా..

ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తిగత కారణాల తో పార్టీ మారుతున్నారన్నారు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు సుబ్బారెడ్డి. వచ్చే ఎన్నికల్లో కొంత మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నారు.

వారందరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమని అన్నారు.

Advertisment
తాజా కథనాలు